స్పందన దరఖాస్తులకు సత్వర పరిష్కారం..


Ens Balu
4
Vizianagaram
2021-08-02 13:37:12

స్పందన దరఖాస్తులపై అధికారులు సత్వరమే స్పందించాలని పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌తీ సోమ‌వారం నిర్వహించిన స్పంద‌న కార్య‌క్ర‌మానికి మొత్తం 282 విన‌తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు దరఖాస్తు చేసుకున్న సమస్యలపై పరిష్కారం ఎన్ని రోజుల్లో చేస్తామో తెలియజేయాలన్నారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహిచడం వలన జిల్లా కేంద్రాలకు అర్జీదారులు వచ్చే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకొని గ్రామ సచివాలయాల్లో స్పందన నిత్యం జరిగేలా చూడాలని గ్రామ సచివాలయ జాయంట్ కలెక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్లు డా.జి.సి. కిషోర్ కుమార్,  డా. మహేష్ కుమార్, మయూర్ అశోక్, జె.వెంకటరావు, డి.ఆర్.ఓ. గణపతిరావు, డిపియం పద్మావతి,మత్స్యశాఖ అదనపు సంచాలకులు ఎన్.నిర్మల కుమారి, ఇతర జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.