ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బాధతలు స్వీకరించాక కుంభా రవిబాబు తొలిసారి శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారిని సతీ సమీతంగా దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్థంబాన్ని ఆలింగన చేసుకున్నారు. పదవి వస్తే స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని రవిబాబు మీడియాతో తెలిపారు. అంతకుముందు ఆలయం పక్కనున్న రాజగోపురం, కాశీవిశ్వేశ్వర స్వామివారిని కూడా ఆయన దర్శించుకున్నారు.