రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది..


Ens Balu
2
Visakhapatnam
2021-08-02 15:53:30

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని, రైతు శ్రేయస్సు కోరి నియోజకవర్గ, మండల స్థాయిల్లో రైతు భరోసా కేంద్రాలు వ్యవస్థ తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి అన్నారు. జిల్లాలో 627 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని. ఇప్పటికే 80 పూర్తయి రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు మరిన్ని పెంచుతామని అన్నారు. ఈ-క్రాప్ విధానంలో రైతులందరినీ నమోదు చేసి.. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇనాం భూముల్లో రైతు భరోసా కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వ ఘనత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఉంటేనే బోరు వేసుకునే సౌలభ్యం ఉందని. ఎకరం ఉన్న రైతులకు కూడా ఆ సౌకర్యం కల్పించే విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. జిల్లాలోని సబ్బవరంలో ఏర్పాటు చేసిన సీడ్ ప్రాసెస్సింగ్ ప్లాంట్ మంజూరైందని. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. సాయిల్ టెస్టింగ్ లాబ్స్ విశాఖ, అనకాపల్లిలో ఉన్నాయని, నర్సీపట్నంలో ఏర్పాటు చేయాలని సూచించామని అన్నారు. వ్యవసాయ సంబంధిత సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 756 కోట్లు రైతు భరోసాగా ఇచ్చిందని అన్నారు.
ఇకపై ప్రతినెలా 3వ శుక్రవారం వ్యవసాయ అడ్వైజరీ సమావేసం నిర్వహిస్తామని అన్నారు. ఈ తరహా సమావేశాలు అడ్వైజరీ బోర్డు చైర్ పర్సన్, సభ్యుల సమక్షంలో నియోజకవర్గ, మండల స్థాయిల్లో ప్రతినెలా జరిగేలా చూస్తామన్నారు. జైజవాన్, జైకిసాన్, రైతును రాజు చేస్తామని గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయని.. సీఎం జగన్ మాత్రం వాటిని ఆచరణలో పెట్టారని అన్నారు. వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండడుగులు వేస్తే, జగన్ నాలుగడుగులు వేస్తున్నారని అన్నారు. గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని వైఎస్ అంటే. ఎద్దేవా చేసారని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని ఈసందర్భంగా మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
అంతకు ముందు అగ్రికల్టర్ ఎడ్వయిజరి బోర్డు సమావేశం నిర్వహించ బడింది.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ మరియు సంబంధిత అధికారులు మంచి దిగుబడుల కు,  ఆదాయానికి గాను  రైతులకు  సలహాలు సూచనలు ఇన్యాలని, మేలైన విత్తనాలు,, ఎరువుల ను అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రోగ్ర సి వ్ రైతులు  పలు సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు. జిల్లా కలక్టరు డా. ఎ. మల్లి ఖార్జున మాట్లాడుతూ , అధికారులు రైతుల తెలిపిన అంశాల పై తన తో చర్చించాలన్నారు. కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తుఫానులో తమలపాకుల రైతులు నష్టపోతున్నారని ఈ పంటను రైతు భరోసా పరిధిలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో  విప్ బూడి ముత్యాల నాయుడు- పాయకరావుపేట శాసనసభ్యులు గొల్లబాబురావు, పాడేరు శాసనసభ్యులు కె.భాగ్యలక్ష్మీ, ఎలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు, గాజువాక శాసనసభ్యులు తిప్పలనాగిరెడ్డి, అరకు శాసనసభ్యులు శెట్టి ఫాల్గున, విశాఖ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ వెస్ట్ శాసనసభ్యులు పి.వి.జి.నాయుడు, డిసిఎమ్ ఎస్ ఛైర్మన్, వుడా ఛైర్మన్ అక్కరమాని విజయనిర్మల, జాయింట్ కలెక్టర్ యం .వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర అగ్రికల్చర్ లీలావతి, సెరి కల్చర్, హార్టి కల్చర్, ఎనిమల్ హస్బెండరీ, సివిల్ సప్లయిస్, ఎపిఇపిడిసిఎల్, ఎడి మార్కెటింగ్, తదితర అధికారులు,  ప్రోగ్రసివ్ రైతులు సరస్వతి, గంగు నాయుడు, ఆనంద్, రమణ, పాండు, సూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.