ఆత్మీయ సమావేశం..జిల్లా అభివ్రుద్ధికి నిర్ధేశం..


Ens Balu
2
Vizianagaram
2021-08-02 16:28:41

విజయనగరం జిల్లా కలెక్టరమ్మ ఏ.సూర్యకుమారి ఏ కార్యక్రమం చేపట్టినా చాలా వినూత్నంగా వుంటుంది.. ఇటీవలే విధుల్లోకి చేరిన కలెక్టర్ జిల్లా అధికారులందరినీ ఒకేసారి పరిచియం చేసుకోవడంతోపాటు, వారి శాఖలు తెలుసుకునేందుకు అధికారులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం సోమవారం రాత్రి ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్లుగా వున్నవారు ముఖ్యమైన రోజుల్లోనే మాత్రమే నిర్వహిస్తుంటారు. కానీ మనం పనిచేయడం ప్రారంభించిన రోజే చాలా ముఖ్యమైన రోజుగా భావించే కలెక్టరమ్మ అధికారులందరితో ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో జిల్లా అధికారులంతా ఒక్కసారి కలెక్టర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని తమను తాము పరిచియం చేసుకుంటూ జిల్లా అభివ్రుద్ధిలో మీవెంటనే మేమంటూ పదం కలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్క జిల్లా అధికారిణీ కలెక్టర్ స్వయంగా పలుకరించారు. జిల్లాని రాష్ట్రంలో ప్రగతి పధంలో నిలబెట్టడానికి అధికారులంతా సమిష్టిగా కలిసి పనిచేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో
జిల్లా ఎస్పీ దీపిక పాటిల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, జాయింట్ కలెక్టర్ లు డా జి.సి. కిషోర్ కుమార్, డా మహేష్ కుమార్, మయూర్ అశోక్,  జె. వెంకట రావు, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావ్నా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి, జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఇందులో పాల్గొన్నారు. మహారాజా సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.