సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దృష్టి సారించాలని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన శానిటరీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె 3వ జోన్ 24వ వార్డు పరిధిలో తులసి పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీహనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, కాలువలలో స్ప్రేయింగు చేయించాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ప్రతి శుక్రవారం “డ్రైడే” పాటించేలా చూడాలని, డెంగ్యూ, మలేరియ కేసులు నమోదు అవకుండా చూడాల్సిన బాధ్యతా మలేరియా సిబ్బందిపై ఉందని కమిషనర్ తెలిపారు. పారిశుధ్య సిబ్బందిచే 8గంటలు పని చేయించాలని రోడ్లు, కాలువలు శుభ్రపరచాలని ప్రతీ ఇంటి నుండి తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తను సేకరించాలని కమర్షియల్ ఏరియాలలో కూడా చెత్త సేకరణ జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మీకులను సర్దుబాటు చేయాలని, ఎ పనికి నిర్దేశించిన పారిశుధ్య కార్మీకులను ఆ పనికే ఉపయోగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆదేశించారు. వార్డులో త్రాగు నీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్య కారీకుల పనితీరుపై స్థానిక ప్రజలను అడిగి తెలుసికున్నారు. ఈ పర్యటనలో 3వ జోనల్ కమిషనర్ కె.శివ ప్రసాద్, కార్యనిర్వాహక ఇంజనీర్ చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ జనార్ధన, శానిటరీ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.