7న కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటన..


Ens Balu
3
Srikakulam
2021-08-03 14:16:19

కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ నెల 7వ తేదీన రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటనపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళ వారం సంబంధిత అధికారులు, బ్యాంకులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆయన ఆదేశించారు. పొందూరు ఖాదీతో పాటు చేనేతకారుల అంశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ పథకాల క్రింద రుణాలు పంపిణీ ఉంటుందని ఆయన చెప్పారు. పొందూరు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగతుందన్నారు. అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శించాలని ఆయన సూచించారు. బ్యాంకులు సైతం తమ కార్యలాపాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. యు బి శత శాతం బ్యాంకు డిజిటలైజేషన్ ప్రక్రియను మంత్రి ప్రారంభించు అవకాశం ఉందని ఆయన తెలిపారు. లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బాలివాడ దయానిధి, ఆర్డీఓ ఐ.కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం బి. గోపాల కృష్ణ, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, యుబిఐ జోనల్ మేనేజర్ కే.ఎస్. డి.శివ వర ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జివిబిడి హరి ప్రసాద్, నాబార్డు డిడిఎం మిలింద్ చౌసాల్కర్,ఎస్బిఐ ఆర్ఎం తపోధన్ దేహారి, డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, డిఆర్డిఎ పిడి బి. శాంతి శ్రీ, డా. పద్మ,  స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పడాల భూదేవి, ఎం. ప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు.