యాంత్రీకరణ దిశగా రైతులు అడుగు వేయాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం లంకం గ్రామంలో అగ్రికల్చర్ పరిశోధన కేంద్ర ( రాగోలు ) సౌజన్యంతో మంగళవారం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు వరి నాటు వేసే యంత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరినాటు వేసే యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులు వరి నాటు వేసే యంత్రం ద్వారా నాటు వేస్తే తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో నాటు వేయవచ్చన్నారు. కూలీలు సైతం తక్కువగా ఉపయోగపడతారని, పని ముట్లను ఉపయోగిస్తే ఖర్చు ఆదా అవుతుందన్నారు. అగ్రికల్చర్ పరిశోధన కేంద్ర ( రాగోలు ) వారి సౌజన్యంతో విత్తనాలు వేసి - కోత వరుకు బాధ్యత తీసుకునే కార్యక్రమం, యంత్రం ద్వారా నాటు వేయటం వల్ల కలిగే లాభాలను రైతులకు శాస్త్రవేత్త డా.పి.వి.వి. సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పద్మావతీ, ఆచార్య ఎన్.జి రంగ బోర్డ్ సభ్యులు డా. నేతాజీ, ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ బాబు, సర్పంచ్ ప్రతినిధి చిట్టి రవికుమార్, మాజీ జెడ్పిటిసి సభ్యులు చిట్టి జనార్ధన, సర్పంచ్ గెదల చంగల్ రావు, అల్లు లక్ష్మీనారాయణ, గోండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.