కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ మంగళ వారం పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన పొందూరు రానున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థ మరియు సొసైటిను సందర్శించారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయునున్న సభా స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు, బందోబస్తు తదితర కార్య్రమాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పీ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.