అధ్యాపకులు కాంట్రాక్టు రెన్యూవల్ చేసుకోవాలి..


Ens Balu
2
Srikakulam
2021-08-03 14:21:44

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులు రెన్యువల్ చేసుకొనుటకు ధరఖాస్తులను కోరుతున్నట్లు ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకులు డా.చప్పిడి కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు. 2020-21 విద్యా సం.లో ఈ ఏడాది మార్చి 31 నాటికి ఒప్పంద అధ్యాపకులు గా పనిచేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. 2021-22 సం.లో పనిచేయుటకు ఆసక్తి గల అధ్యాపకులు ఆగస్ట్ 6వ తేదీ సాయంత్రం 5.00 గం.ల లోగా  తమకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రెన్యూవల్ కొరకు వచ్చిన దరఖాస్తులను ఆగస్ట్ 7వ తేదీన జిల్లా ఐడి ప్రిన్సిపాల్ కు సమర్పించాలని సూచించారు. ఈ నెల 10న రెన్యూవల్ కొరకు వచ్చిన దరఖాస్తులను జిల్లా సెలక్షన్ కమిటీ సమక్షంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. ఆగస్ట్ 12న  రెన్యూవల్ అయిన ఒప్పంద అధ్యాపకులు 2021-22 విద్యా సం.నకు గాను అగ్రిమెంట్ చేసుకోవలసి ఉంటుందని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.