సీఎం పర్యటన విజయవంతం చేయండి..


Ens Balu
4
Guntur
2021-08-03 14:22:58

రాష్ట్రంలో 30 శాతం కంటే అధికంగా పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటటం పై చైతన్యం కలిగించే లక్ష్యంతో ఆగష్టు 5 వ తేదిన వనమహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. మంగళగిరి వద్ద అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్ ) లో గురువారం జరిగే 72వ వనమహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నందున అక్కడి ఏర్పాట్లను  మంగళవారం  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎయిమ్స్ వద్ద ముఖ్యమంత్రి మొక్కలు నాటే ప్రాంతంను, సభా స్థలం, వేదిక, ముఖ్యఅతిధులు ప్రయాణించే మార్గలలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించి పర్యవేక్షణ అధికారులకు సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంకు విధులు కేటాయించిన అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 72వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఐదవ తేదీ మంగళగిరి ఎయిమ్స్లో జరిగే కార్యక్రమంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటుతారన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విధ్యార్ధులు, వాలంటీర్లు, మహిళలు పాల్గొని రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్, ఎయిమ్స్లో పచ్చదనం కోసం నిర్దేశించిన ప్రాంతాలలో మొక్కలు నాటతారన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయటం జరుగుతుందని, వేదిక, బ్యారికేటింగ్, రూట్ ప్లాన్, పార్కింగ్ పై పోలీస్, అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో బహిరంగ సభా స్థలిలో సీటింగ్ ప్రతి కూర్చికి ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని,  ప్రతి ఒక్కరు మాస్క్ ఖచ్చింతంగా ధరించేలా సభా  స్థలంలో మాస్క్లు అందుబాటులో ఉంచుతున్నామని, కోవిడ్ ప్రవర్తన నియామవళి  ఖచ్చితంగా అమలు చేస్తూ  అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ శాఖ ద్వారా టీ షర్టులు, క్యాప్లు అందించటం జరుగుతుందన్నారు.

అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 5వ తేది మంగళగిరిలో ఎయిమ్స్లో జరిగే వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతా  పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆగస్టు 5వ తేదీ ముఖ్య అతిధులు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ మళ్ళింపు ప్రణాళికపై  ముందుగానే సమాచారం అందించి సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం  సజావుగా కొనసాగేలా, విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి  చేస్తామన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) కే. శ్రీధర్ రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి (టెరిటోరియల్) రామచంద్రావు, మంగళగిరి– తాడేపల్లి కార్పోరేషన్ నిరంజన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ హేమమాలిని రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి, గుంటూరు రెవెన్యూ డివిజన్ అదికారి  భాస్కర రెడ్డి, మంగళగిరి తహశీల్దారు శివ రామ్ ప్రసాద్, ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.