త్వరితగతిన ఈ-క్రాప్ నమోదు చేయాలి..
Ens Balu
1
Kakinada
2021-08-03 15:15:03
ఈ-క్రాప్ బుకింగ్‌కు సంబంధించి రైతులకు తప్పనిసరిగా ఫిజికల్ రశీదు అందించాలని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయాధికారులతో మాట్లాడారు. సచివాలయాల వారీగా ఈ-క్రాప్ నమోదు శతశాతం జరగాలన్నారు. రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ, భూ రికార్డుల స్వచ్ఛీకరణకు సంబంధించి రీసర్వే ప్రక్రియను రెండోదశలో మండలానికి ఓ గ్రామంలో చేపట్టనున్నందున సన్నద్ధత చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీఆర్‌సీ కార్డుల జారీకి సంబంధించి పెండింగ్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అమలాపురం, రామచంద్రాపురం డివిజన్లలో ఇళ్ల స్థలాల లేఅవుట్ల లెవెలింగ్ ప్రక్రియను పూర్తిచేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందజేయాలని జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. 104 కాల్‌సెంటర్‌కు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆగస్టు 10న నేతన్న హస్తం కార్యక్రమం ఉన్నందున ఇందుకు సంబంధించి లబ్ధిదారుల బయోమెట్రిక్ అథింటికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని జేసీ (ఏ అండ్ డబ్ల్యూ) జి.రాజకుమారి సూచించారు. ఆగస్టు 10న 17 వేల ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ ప్రారంభమై, 25 నాటికి బేస్‌మెంట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా చూడాల్సి ఉందని జేసీ(హెచ్) ఎ.భార్గవ్‌తేజ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, జేడీ(ఏ) ఎన్.విజయ్‌కుమార్, పీడీ హౌసింగ్ వీరేశ్వర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.