విజయనగరం జిల్లా సమీక్ష మండలి(డి.ఆర్.సి.) సమావేశం ఈనెల 7వ తేదీన జరగనుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఆరోజు ఉదయం 10 గంటలకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. సూర్యకుమారి తెలిపారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఖరీఫ్ సీజనుకు సంబంధించి పంటల సాగుకు ఏర్పాట్లు, జలవనరుల శాఖ పనులు, కోవిడ్-19 నియంత్రణ చర్యలు, ఉపాధిహామీ కన్వర్జెన్స్ పనులు, గృహనిర్మాణంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాలపై సమీక్షిస్తారు.