భవన నిర్మాణాలను వేగంగా నిర్దేశించిన సమయానికి పూర్తి చేసి ప్రతీ వారం పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున స్పష్టమైన ఆదే్శాలు జారీ చేసారు. అభివృద్ది పనుల్లో ప్రతీ వారం ప్రోగ్రస్ చూపించాలని గణాంకాలు చూపిసై క్రాస్ చెక్ చేయిస్తానన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరం నుండి , ఉపాధి హామి పనులు, మనబడి, నాడు నేడు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు ,వై ఎస్ ఆర్ హైల్త్ క్లీనిక్ లు, అంగన్వాడీ కేంద్రాలు, జగనన్న పచ్చతోరణం, పశుగ్రాస పెంపకం, స్పందన ఫిర్యాదుల పరిష్కారం, జనగన్న పాలవెల్లువ పై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామిలో చేపట్టి పూర్తి చేసిన పనుల స్దాయిలకు ఎక్సపెండిచర్ బుక్ చేయాలని ఆదేశించారు. మంజూరు చేసిన ప్రతి పని ప్రారంభించాలని చెప్పారు. మనబడి నాడు నేడు పనులు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వై ఎస్ ఆర్ డిజిటల్ లైబ్రెరీలు నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని తాహశీల్థారులకు సూచించారు. ఉపాధి హామి పధకంలో రూ. 2 కోట్ల 34 లక్షలు లేబర్ బడ్జెట్ లక్ష్యంగా నిర్దేశించామని, జూలై నాటికి రూ. 1కోటి 64 లక్షలు పూర్తి చేసారని అన్నారు. ఈ నెలాఖరు నాటికి మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పశుగ్రాస పెంపకంపై పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశుగ్రాసం పెంపకంపై డ్వామా, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వై ఎస్ ఆర్ జలకళ ప్రోగ్రాంలో 344 బోర్ వెల్స్ వేశామని డ్వమా పి.డి. వివరించారు. అర్భన్ ప్రాంతాలలో జరుగుతున్న మనబడి నాడు – నేడు , అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలపై ఆరాతీసారు.
ఈ నెల 18వ తేది నుంచి పాలసేకరణ
జగనన్న పాల వెల్లువ – ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్టులో ఈ నెల 18వ తేదీ నుంచి పాలసేకరణ ప్రారంభిస్తామన్నారు. మహిళా సంఘాలతో డైరీ ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో 123 గ్రామాల్లో పాలు సేకరిస్తారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్ ఇ సుధాకర్ రెడ్డి, డ్వామా పి.డి. ఇ. సందీప్, డి ఇ ఓ లింగేశ్వరరెడ్డి, పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డా.ఎన్. కరుణాకరరావు, పంచాయితీ రాజ్ పి .ఐ .యు. ఈ ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.