అధికారాలను భర్తలకు ఎప్పుడూ అప్పగించకూడదు..


Ens Balu
2
Vizianagaram
2021-08-04 11:00:21

నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన మహిళలు ఎక్కువగా ఉన్నారని, వారిని చూస్తుంటే ఆనందంగా ఉందని, అయితే  వారి అధికారాన్ని భర్తలకు అప్పగించకుండా వారే చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి తెలిపారు.  శిక్షణ లో నేర్చుకున్న అంశాలను పాలనలో  అమలు చేయాలనీ అన్నారు.  జే. ఎన్.టి యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణా ముగింపు   కార్యక్రమం లో బుధవారం కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు.  సర్పంచ్ అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి అని, గ్రామానికి మంచి జరిగినా , చెడు జరిగినా  పూర్తి బాధ్యత సర్పంచ్ లదే నని అన్నారు.  ఉన్నటువంటి వనరులతోనే అభివృద్ధిని చేయవచ్చని ముందుగా ఆ గ్రామానికి ఏం కావాలో గ్రామ సభల ద్వారా తీర్మానం చేసుకోవాలని, పార్టీల కతీతంగా ప్రజలంతా మనవాళ్ళే అనుకోని పని చేయాలనీ హితవు పలికారు.  మంచి పనులు చేస్తే  సర్పంచ్ మాటకు గ్రామస్తులంత గౌరవిస్తారని, సంక్షేమ పధకాల పై పూర్తి  అవగాహన కలిగించుకొని, పారదర్శకంగా వాటిని ప్రజలకు అందేలా చూడాలని అన్నారు.  అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేలా చూస్తే గ్రామం లోని పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఆశ వర్కర్స్ ప్రతి రోజు గ్రామానికి వచ్చి ఫీవర్ సర్వే చేస్తే గ్రామస్తులంత ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యతలను   పెట్టుకోవాలని, బహిరంగ  మల ముత్రాదుల విసర్జనలు లేకుండా  పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.  శిక్షణ నుండి గ్రామానికి వెళ్ళగానే  జగనన్న  పచ్చతోరణం  క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.  ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రం లో కార్నాల్ గ్రామం లో గ్రామస్తుల శ్రమదానం తో  మురుగు నీరు నుండి మంచి నీరు వచ్చేలా నిర్మించుకున్న 3 రకాల చెరువుల గురించి వివరిస్తూ  ఆ విజయ గాధ  షార్ట్ ఫిలింను పిపిటి  ద్వారా ప్రదర్శించారు.  ప్రతిది డబ్బు తోనే ముడిపెట్ట కూడదని, ప్రజలంతా ఏకమైతే  శ్రమదానం ద్వారా గ్రామాల అవసరాలను కొన్ని తీర్చుకోవచ్చునని తెలిపారు.  అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ లను అందజేశారు. 
ఫోర్టి ఫైడ్  బియ్యం అంటే బలవర్ధక బియ్యం :  సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ 
ఫోర్టిఫైడ్  బియ్యం అంటే సాధారణ ధాన్యం లో పోషకాలను కలిపి మిల్లు ఆడిస్తామని,  అవి బలవర్ధకంగా తయారవుతాయని   సంయుక్త కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. సర్పంచ్ ల శిక్షణ ముగింపు లో కలెక్టర్ తో  పాటు పాల్గొన్న జే.సి. ఫోర్టి ఫైడ్ బియ్యం పై సర్పంచ్ లకు అవగాహన కల్పించారు. ఫోర్టి ఫైడ్ బియ్యం పై ముద్రించిన కర పత్రాలను,  గోడ పత్రికలను,  ప్ల కార్డులను సర్పంచ్ లకు అందజేశారు.  గ్రామాల్లో ఈ బియ్యం పై అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు వినియోగించేలా చూడాలన్నారు.  ఈ బియ్యం లో సూక్ష్మ పోషకాలు మెండుగా ఉంటాయని, రక్త హీనత నివారణ లో, నాడీ వ్యవస్థ అభివ్రుది, గర్భస్థ శిశువు  వికాసం జరుగుఉందని, చిన్న పిల్లలు, గర్భిణీలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.  సర్పంచ్ లు  ఈ విషయాలన్నిటిని ప్రజలకు అర్ధమయ్యేలా హేప్పలన్నారు.  ఈ సమావేశం  డి.పి.ఓ  సుభాషిని, డి.ఎల్.డి.ఓ రామచంద్ర రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

సిఫార్సు