అన్నదాతలకు అండగా నిండుగా రైతు భరోసా కేంద్రాలు..


Ens Balu
2
Vizianagaram
2021-08-04 11:04:19

 రైతు బాగుంటేనే రాష్ట్రం ఆన్ని విధాలా అభివృధి చెందుతుంది, వ్యవసాయంతో ఆహార భద్రత కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగు తాయనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మార్పులు చేశారు ఆని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. బుధవారం కురుపాంలో  ఉప ముఖ్యమంత్రి రైతు భారోసా కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భం గా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ, రైతులకు బహుళ ప్రయోజనాలు కలిగించే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాలలోనే  విత్తనం నుండి పండించిన పంట అమ్మకం వరకు సేవలందిస్తోంది అన్నారు. అలాగే వై.ఎస్.అర్. రైతు భరోసా సన్న చిన్నకారు రైతుల పంటల కాలం ప్రారంభమైన  నుండి చివరివరకు సాగు పెట్టుబడికి అవసరమైయ్యే ఖర్చులకు సకాలంలో చెల్లిస్తేనే రైతుకు ప్రయోజనం చేకూరుతుందని భావించి వై ఎస్.ఆర్ రైతు భరోసా క్రింద సంవత్సరానికి 13,500 చొప్పున 5 సంవత్సరాలు ప్రతి రైతుకు రూ.67,500 సాయం అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు,. దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వై.ఎస్.ఆర్ రైతుభరోసా క్రింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వై.ఎస్.ఆర్.ప్రభుత్వం అని పేర్కొన్నారు. 

        ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్. కూర్మనాథ్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం లో విజ్ఞానాన్ని, వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సబ్సిడీ వంటి సౌకర్యాలు ఒకే దగ్గర పొందడానికి  రైతు భరోసా కేంద్రం అన్నారు.