సీనియారిటీల జాబితా సిద్దంచేయండి..


Ens Balu
2
Srikakulam
2021-08-04 14:28:52

శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న పరిపాలన అధికారులు, సీనియర్ అసిస్టెంట్లకు చెందిన టెంటటివ్ సీనియారిటీ జాబితాను ఆయా అధికారుల జి – మెయిల్ నందు ఉంచినట్లు  జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన జారీచేసారు. 2021 –22 పేనల్ సం.నకు గాను జిల్లాలో పనిచేస్తున్న పరిపాలన అధికారులు, సీనియర్ అసిస్టెంట్ల సీనియారిటి లిస్టును సంబంధిత ఉద్యోగులకు సమాచారాన్ని అందించుటకు ఆయా అధికారుల ఇ-మెయిల్స్ నందు ఉంచడం జరిగిందని, వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నఎడల సంబంధిత ఆధారాలతో ఆయా అధికారుల ద్వారా ఈ నెల 15 లోగా తమ కార్యాలయానికి ప్రత్యేక దూత ద్వారా సమర్పించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.