ఆగస్టు 5న జగనన్న పచ్చతోరణం..
Ens Balu
4
Kakinada
2021-08-04 14:56:18
కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని వాకలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న పచ్చతోరణం జిల్లాస్థాయి కార్యక్రమం ఆగస్టు 5న జరగనుందని డీఎఫ్‌వో (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జగనన్న పచ్చ తోరణం (వన మహోత్సవం, 2021) కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి పిలుపు మేరకు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములై పచ్చతోరణంలో జిల్లాను ముందు వరుసలో నిలపాలని ప్రజలను శ్రీనివాస్ కోరారు.