21 లక్షల మందికి కోవిడ్ వేక్సిన్..


Ens Balu
3
Visakhapatnam
2021-08-04 14:57:07

విశాఖ జిల్లాలో జిల్లాలో  21 లక్షల మందికి   కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు  వేసారని రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. బుధవారం జిల్లా అధికారులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 3వ దశ నివారణకు తీసుకోవలసిన చర్యలపై  అధికారులతో  చర్చించామన్నారు. కోవిడ్ నివారణలో  విశాఖ అగ్ర స్థానంలో  ఉండాలని ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు   నూరు శాతం  వ్యాక్సినేషన్  సాధించాలని  అధికారులను  ఆదేశించినట్టు చెప్పారు. 3వ దశపై వైద్య నిపుణల సూచనల మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. కాగా  ఈ నెల 16వ తేది నుంచి  జిల్లాలో  ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుందని  జిల్లా కలెక్టర్ చెప్పారని  తగిన జాగ్రత్తలు తీసుకొని  ఆర్మీ రిక్రూట్ మెంట్  ఆగకుండా   రిక్రూట్ మెంట్   ప్రక్రియ పూర్తి చేయాలని  సూచించామని  చెప్పారు.    కోవిడ్ నివారణపై  ప్రజలను  అప్రమత్తం  చేస్తూ  అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో  పలువురు  శాసన సభ్యులు పాల్గొన్నారు.