అప్పన్నకు డీసీపీ గౌతమి శాలి పూజలు..
Ens Balu
3
Simhachalam
2021-08-05 04:45:13
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారిని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ గౌతమి శాలి గురువారం దర్శించుకున్నారు. ఈమేరకు ఆమెకు ఆలయ అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యుడు దినేష్ రాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇటీవలే సంపెంగ తైలాలతో శుభ్రపరిచిన నరసింహ అవతారాలు, శిల్పకళలను పరిశీలించి అంతర్జాతీయ హెరిటేజ్ సైట్ స్టేటస్ కోసం ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆమెకు సిబ్బంది వివరించారు. ఆలయంలోని శిల్పకళ అద్భుతంగా ఉందని గౌతమిశాలి ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం కళ్యాణ మండపాన్ని సందర్శించారు ఆర్జిత సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.