భవననిర్మాణకార్మికులు సంక్షేమ బోర్డు నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారిమళ్లించిన 14వందల కోట్లు రూపాయలనుతక్షణమే బోర్డులో జమ చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి.వామునమూర్తి డిమాండ్ చేశారు. గురువారం ఇసుక తోట జంక్షన్ వద్ద భవన నిర్మాణకార్మికులుతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ బోర్డులో సభుత్వం తీసుకొనిఉన్న కార్మికులు తక్షణమే గుర్తింపు కార్డులుఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతప్రభుత్వం లో నిర్మాణకార్మికులకు అన్యాయం జరిగిందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులు న్యాయం చేస్తామని హామీయిచ్చిన ముఖ్యమంత్రి జగన్ నేటికి అధికారంలోకి వచ్చి
రెండు సంవత్సరాలు అయిన కార్మికులు బ్రతుకులకు ఒక దారి చూపలేదన్నారు. ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో, మరోపక్క కరోనా మహమ్మారి తో మరోపక్క కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిజీవితాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రావి కృష్ణ,ఎమ్.గోవిందు,ఎమ్.రమణభవన,నిర్మాణకార్మిక సంఘం నాయకులు జి.రాజు,తాతారావు,సూర్యనారాయణ,ఆశిలునాయుడు రాములమ్మ, లక్ష్మీ, దుర్గారావు, గౌరీమ్మ తవుడుమ్మ తదితరులుపాల్గొన్నారు.