వ్యాధులపై ప్రజలకు అవగాహన పెంచండి..


Ens Balu
3
Visakhapatnam
2021-08-05 16:16:10

ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన్ కల్పించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె రెండవ జోన్  10వ వార్డు పరిధిలోని ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై మలేరియా విభాగం వారు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా మొదలైనవి నియంత్రణకు లార్వా నిర్మూలనకు కార్యక్రమంనకు స్ప్రేయింగ్ చేయించాలని, దోమలు నియంత్రణకు నిరంతరం ఫాగింగు చేయాలని, వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ప్రతీ శుక్రవారం “డ్రై డే” పాటించాలని, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ సీసాలు ఇంటి పరిసరాలలో ఉండకుండా చూడాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. రెసిడెన్షియాల్ వెల్ఫేర్ అసోషియేషన్ (ఆర్.డబ్ల్యూ.ఎస్), ఆర్.పి.లు వారితో మాట్లాడుతూ సేవా కార్యక్రమం ఏ ఏ ప్రాంతాలలో  చేస్తున్నారని ఆరా తీశారు. అనంతరం డోర్ టు డోర్ చెత్త నిర్వహణ చేయు విధానాన్ని పరిశీలించి, ప్రతీ ఇంటి నుండి తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తను వేరు వేరుగా సేకరించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. కాలువలలో చెత్త సరిగా తీయడంలేదని, కాలువలలో ఉన్న చెత్తను దగ్గరుండి తీయించాలని శానిటరీ కార్యదర్శిని ఆదేశించారు. వార్డులో త్రాగునీరు సమయానికి రావడంలేదని స్థానికులు కమిషనర్ కు తెలపగా, సంబందిత సహాయక ఇంజినీరు(వాటర్ సప్లై)ను ప్రతీ రోజూ త్రాగునీరు సమయం ప్రకారం అందించాలని ఆదేశించారు.  డో.నెం. 03-23/1 ఇంటిలో డాబా పై కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున విధానాన్ని పరిశీలించి వారిని అభినందించారు. కంపోస్ట్ ఎరువు తయారు చేయుటకు పాటించవలసిన పద్దతులను, వాటి ఉపయోగాలను తెలిపి వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. కంపోస్ట్ ఎరువు తయారు చేయుటకు సహాయ సహకారాలు అందించాలని, వార్డులోని బరియల్ గ్రౌండ్ పాడైనందున, దానికి మరమత్తులు చేయించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ బి.రాము, ఎఎంఒహెచ్  కిషోర్, ఎసిపి భాస్కర బాబు, కర్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, మత్స్య రాజు,  ఉప కర్యనిర్వాహక ఇంజినీర్ వంశీ, సహాయక ఇంజినీర్లు అప్పాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.