స్థాయి సంఘంలో 3 అంశాలు ఆమోదం..
Ens Balu
2
Visakhapatnam
2021-08-05 16:34:16
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం గురువారం జివిఎంసి స్థాయి సంఘ సమావేశ మందిరం నందు నగర మేయర్ మరియు స్థాయి సంఘం చైర్మెన్ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. అజెండాలో మొదటి మూడు అంశాలు స్థాయి సంఘ సమావేశంలో ఆమోదం పొందగా, నాలుగవ అంశము వాయిదా వేయడమైనదని, 5వ అంశమును తిరస్కరించారు. ఈ సమావేశంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి, డా. వి. సన్యాసి రావు, డి.సి.ఆర్. నల్లనయ్య, డి.ఇ.ఒ. శ్రీనివాస్, కార్యదర్శి లావణ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.