అర్భన్ పీహెచ్సీలకు మంత్రి శంకుస్థాపన..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-08-05 16:35:56
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 8వ జోన్ 89వ వార్డు లోని యల్లపువానిపాలెం - 2(కొత్త పాలెం) నందు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రివర్యులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నికల హామీలో ఇచ్చిన నవరత్నాలతో పాటూ, ప్రజల ఆరోగ్యం కొరకు ఆరోగ్యశ్రీ లో అనేక రోగాలకు వైద్యం సేవలు చేర్చారని తెలిపారు. ప్రస్తుతం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వార్డులలో రూ.80 లక్షల వ్యయంతో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంనకు శంకుస్థానం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ ఎపి హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి రూ. 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరామేశ్వరరావు, రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ మల్ల విజయప్రసాద్, అయిదవ జోనల్ కమిషనర్ చక్రవర్తి, కార్యనిర్వాహక ఇంజనీరు, 89వ వార్డు వైసిపి ఇంచార్జ్ దొడ్డి రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.