విశాఖలో లక్షమందికి కరోనా వేక్సిన్లు వేయాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-08-05 16:44:30

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య   కేంద్రాలు, వార్డు సచివాలయాల్లో ఆగస్టు 6న లక్ష కోవిడ్ వ్యాక్సినేషన్లు  వేస్తున్నట్టు జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అందరు జోనల్ కమిషనర్లు,  వార్డు ప్రత్యేక అధికారులు ఏఎంహెచ్ వో లు,  శానిటరీ సూపర్వైజర్ లు,  శానిటరీ ఇన్స్పెక్టర్లు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో  పాల్గొని విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.  వ్యాక్సినేషన్   ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడిన వారు,  గర్భిణీ స్త్రీలు,  ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు ఉన్న తల్లులకు,  టీచర్స్ కు వ్యాక్సినేషన్ వేయించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.