రహీమున్నీసా బేగంకు ఆరుదైన అవకాశం..


Ens Balu
3
Visakhapatnam
2021-08-05 16:49:39

విశాఖలో ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త రహీమున్నీషాకు అరుదైన అవకాశం దక్కింది. కోవిడ్ పోరులో భాగంగా కరోనా పరిణామాలు, పరిష్కార నైపుణ్యాలు అనే అంశంపై ఆగస్టు 7న జరగనున్న అంతర్జాతీయ వెబినార్ లో ఆమె పాల్గొని ప్రశంగించనున్నారు. ఆఫ్రికా గ్లోబల్ డెవలప్ మెంట్ ఫర్ పాజిటివ్ చేంజ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో ఎంపవర్ ఉమెన్, ఎంపవర్ సొసైటీ అంశానికి సంబంధించి ఈ అంతర్జాతీయ వెబినార్ లో ఆమె తన అభిప్రాయాన్ని ఆలోచనలు, తన వద్ద వున్న ప్రస్తుత పరిస్థితుల తాజాసమాచారాన్ని తెలియజేస్తారు.  అంతేకాకుండా మహిళా సాధికారత దిశగా  దేశం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయో ఆమె ఈ వెబినార్ లో విశ్లేషిస్తారు. ఈ అద్భుతమైన అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని, అలాగే తనకు అంతర్జాతీయంగా ఈ వెబినార్ మరింత బాధ్యత పెంచనుందన్నారు. ఇలాంటి వెబినార్ల ద్వారా మన దేశ పరిస్థితులను తాజాగా అంతర్జీతయంగా తెలియజేయడంతోపాటు, పలు దేశాల్లోని అంశాలను కూడా తెలుసుకొని వాటికి అనుగుణంగా ఇక్కడ పనిచేయడానికి, సేవలు అందించడానికి ఈ తరహా వెబినార్లు ఎంతగానో దోహదపడతాయన్నారు.