ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేసిన కలెక్టర్..


Ens Balu
4
Ongole
2021-08-05 17:00:43

అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అదనపు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఎన్.గోపి,  వి ఆర్ ఓ  మాకం కోటయ్య లను  జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఆ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం మండలంలో అదనపు ఆర్ ఐ గా పనిచేస్తున్న గోపి క్షేత్రస్థాయి విచారణ, రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండానే చుక్కల భూమిని కొందరికి అనుకూలంగా ఆన్ లైన్ లో నమోదు చేయడంపై విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే ఇడుపూరు విఆర్ఓ గా పనిచేస్తున్న మాకం కోటయ్య నకిలీ రికార్డులను సృష్టించి, కొందరికి అనుకూలంగా భూమిని ఇచ్చారనే ఆరోపణలపై విచారణ నివేదిక అనుసరించి సస్పెండ్ చేశారు.  సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు గురువారం నుంచే అమలులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.