రాష్ట్రం లో క్రిస్టియన్, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సేవలు అందించే కు స్మశాన వాటికల అంశానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ అన్నారు. త్వరలోనే ఆయా జిల్లాల కలెక్టర్లు తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ పదవి అలంకారం కాదని, బాధ్యతని సంపూర్ణంగా స్వీకరించి క్రిస్టియన్ లు అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. చర్చిలకు సంబంధించి అధిక ఆస్తులు వున్నా అంతర్గత విభేదాల కారణంగా కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అటువంటి ఆస్తులను పరిరక్షించుకుంటామన్నారు. ప్రార్ధన మందిరాల నిర్మాణాలకు నిబంధనల సడలింపు నకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని అన్నారు. జెరూసలేం, ఈజిప్ట్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు నిజమైన పేదలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. "నవరత్నాల" ద్వారా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పధకాలను చేరువ చేస్తామని తెలిపారు.
మిగిలిన పార్టీల సంగతి ఎలా వున్నా.. వైఎస్సార్సీపీ లో కష్ట పడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తుందని చెప్పేందుకు తనకు అప్పగించిన బాధ్యతే ఉదాహరణ అని ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయ సాయి రెడ్డి నిజాయితీగా ఉంటూ మిగిలిన నాయకులను సమర్ధ వంతంగా పనిచేయించ గలుగుతున్నారని అన్నారు. మనం నిజాయితీ పరులు అయితేనే అవతలి వారిపై చర్యలుతీసుకోగలమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విజయ సాయి రెడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు.
మంచి తనాన్ని గుర్తించి వైజాగ్ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఒదిగి ఉండే వారికి ఉన్నత అవకాశాలు అంది వస్తాయని జాన్ వెస్లీ సాదర మనస్తత్వాన్ని అభినందించారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజ్ పట్నాయక్,జాయింట్ సెక్రెటరీ దాడి రవికుమార్ కార్యవర్గ సభ్యులు ఈరోతి ఈశ్వరరావు, ఎంఎస్సార్ ప్రసాద్, దొండా గిరిబాబు,డేవిడ్రాజ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.