రాజ్యాధికారమే లక్ష్యంగా ఏకం కావాలి..


Ens Balu
5
Kakinada
2021-08-06 14:10:07

రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులు సంఘటితమవ్వాలని "బహుజన ఐక్య వేదిక" జిల్లా రాజకీయ సలహా కమిటీ నాయకులు చోల్లంగి వేణుగోపాల్ సూచించారు.  ఐక్య వేదిక జిల్లా కమిటీ అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, కార్యదర్శి సబ్బతి ఫణీశ్వరరావు ఆధ్వర్యంలో బీసీ సంఘ నాయకుల సమన్వయ సమావేశం కాకినాడ కచరిపేట లోని డా.బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగింది. "బహుజన ఆత్మభిమానం - 
రాజ్యాధికారం" అంశంపై జరిగిన ఈ సమావేశానికి చోల్లంగి వేణుగోపాల్ ముఖ్య సలహాదారుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బహుజన (బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ) వర్గాలు సమైక్యమై రాజ్యాధికారం దిశగా  సమన్వయం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సమావేశంలో పాల్గొన్న బిసి సంఘ నాయకులు మాకిరెడ్డి భాస్కర్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో బహుజన ఐక్యత సాధించాలన్నారు. తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దెంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  బహుజనులు తమ ఆత్మభిమానాన్ని  కాపాడుకుని, రాజ్యాధికారం దిశగా బలపడాలని హితవుపలికారు. గత అనుభవాలను పరిగణలోనికి తీసుకుని, బహుజనుల ఐక్యతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో ఐనవిల్లి నారాయణ, ఆవుపాటి ఉమశంకర్, న్యాయవాదులు టి.పృద్వి రాజ్,కె. శ్రీనివాస్, వి.బద్రి, వి.సాయినాధ్, పి.దుర్గ రమేష్,డి.అబ్రహం, మాణిబాబు తదితరులు పాల్గొన్నారు.