ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం..


Ens Balu
3
ఒంగోలు
2021-08-06 14:15:35

జాతీయ చేనేత దినోత్సవం ఈ నెల 7వ తేదీన అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 10.00 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. చేనేతలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత ఎగ్జిబిషన్, ఉత్పత్తి ధరలకే అమ్మకాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా చీరాల, వేటపాలెం, అద్దంకి తదితర ప్రాంతాలలో చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కోవిడ్ పరిస్థితులలో చేనేతలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నేత కార్మికులను ఆదుకోవడానికి ఈ నెల 7 నుంచి 18వ తేదీ వరకు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నేతన్నలను ఆదుకోవాలని ఆయన కోరారు.