కేంద్ర ఆర్థిక శాఖా మంత్రికి ఘన స్వాగతం..
Ens Balu
1
Visakhapatnam
2021-08-06 14:21:36
శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లబించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాద్, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎస్ రావత్, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, పార్లమెంట్ సభ్యులు జి.వి.ఎల్ . నర్సింహరావు, బొడ్డేడ మాదవి, రామోహన్నాయుడు, ఎం ఎల్ సి లు పి.వి.ఎన్ .మాధవ్, సోము వీర్రాజు, కష్టమ్స్ చీఫ్ కమిషనర్ రమేష్, డి సి పి గౌతమ్ శాలిని, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రంగయ్య, ఆర్ డి ఓ పెంచల కిషోర్, తదితరులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.