ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం పాత వెంకోజిపాలెం, రజక వీధి-1, దుర్గానగర్-1 సచివాలయాలను జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమ పధకాలను పూర్తిగా తెలుసుకొని లబ్దిదారులకు వివరించే విదంగా ఉండాలన్నారు. బయో మెట్రిక్ సమయ వేళలను పాటించాలన్నారు. సిబ్బంది డ్రస్ కోడ్ నిబందనలను పాటించాలన్నారు. స్పందనలో వచ్చిన ధరఖాస్తులను సంబందిత కార్యాలయాలకు నిర్ణీత సమయంలో చేరే విదంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపడుతూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. రిజిష్టర్లను సక్రమంగా అమలు పర్చాలన్నారు.
అర్బన్ హెల్త్ క్లినిక్ లను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పి .అరుణ్ బాబు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో భాగంగా రజక వీధి , పాత వెంకోజిపాలెం, దుర్గానగర్ లకు సంబందించి అర్బన్ హెల్త్ క్లినిక్ల ను ఆకస్మిక తనిఖీలు చేసి వ్యాక్సినేషన్ విదానాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బంది కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. 45 సంవత్సరం లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకొనే విదంగాను అదే విదంగా ఒక డోసు వేసుకున్నవాళ్లు రెండవ డోసు వేసుకొనే విదంగా చర్యలు చేపట్టాలన్నారు.