ద్రవిడ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నవారి సమస్యలను పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ బిసి కమిషన్ మెంబర్ అచారి తల్లోజు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ద్రావిడ యూనివర్సిటీ నందు ఉద్యోగస్తులు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య సి హెచ్ ఏ.రాజేంద్ర ప్రసాద్,రిజిష్ర్టార్ ఆచార్య కె.వేణుగోపాల్ రెడ్డి, వర్సిటీ బిసి లైజనింగ్ అధికారి ఆచార్య మస్తాన్, లతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాసులు మాట్లాడుతూ ద్రావిడ యూనివర్సిటీ లో గత 22 సంవత్సరాలుగా అవుట్ సోర్స్ అటెండర్ గా ఉద్యోగం చేస్తున్నను నాకు పర్మినెంట్ చేయాలని కమిషన్ మెంబర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్. మోహన్ మాట్లాడుతూ నేను రజక కులానికి చెందిన వాడని గత 22 సంవత్సరాలుగా అటెండర్ గా పని చేస్తున్నాను.నాకు అన్ని అర్హతలు వున్నాను నాకు పదోన్నతి కల్పించలేదని, కోర్టుకు తిరిగి కోర్టు ఆర్డర్ ఇచ్చినను నాకు ప్రమోషన్ ఇవ్వలేదని, నకిలీ కుల ధృవ పత్రాలతో ఉద్యోగాలు పొంది ప్రమోషన్లు పొందుతున్నారని, ఇలాంటివి ద్రావిడ యూనివర్సిటీ లో చాలా అవినీతి జరుగుతుందని దీనిపై ఎవ్వరు పటించుకోలేదని, నాకు కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని దరఖాస్తు ను కమిషన్ మెంబర్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మదీన వల్లి మాట్లాడుతూ ద్రావిడ యూనివర్సిటీ లో 267 మంది గత 24 సంవత్సరాల గా సలిశాలని జీతంతో అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్న మా గురించి కుటుంబాల గురించి యూనివర్సిటీ విసి, రిజిస్టర్,రెక్టర్ ఏ ఒక్కరు కూడా మా సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఇక్కడ 267 మంది అవుట్సోర్సింగ్ లో పని చేస్తుంటే అందులో 167 మంది బీసీ కులాల వారు ఉన్నారని, 54 మంది మహిళలు ఉన్నారని మాపై దయవుంచి మాకు తగిన న్యాయం చేయాలని కమిషన్ మెంబర్ కు విన్నవించుకున్నారు. విసి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. ఉద్యోగుల,విద్యార్థుల నుంచి అర్జీలు స్వకరించి వారి సమస్యలను విన్న తర్వాత జాతీయ బిసి కమిషన్ మెంబర్ మాట్లాడుతూ అన్ని చోట్ల బిసిలకు అన్యాయం జరుగుతుందని,బిసిలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ బిసి కమిషన్ ఏర్పాటు చేయడం అందులో భాగంగానే ఈ రెండు సంవత్సరాల్లో దేశంలోనే సుమారు 50 విశ్వవిద్యాలయాలను కమీషన్ మెంబర్లు పరిశీలించి అక్కడ ఉద్యోగస్తులు విద్యార్థులు జరుగుతున్న సమస్యలను తెలుసుకొని కొంతవరకు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఉన్న అధికారలను బిసి కమిషన్ కు ఇవ్వాలని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రధానమంత్రి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్న అధికారాలను బిసి కమిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
చదువుకున్న మేధావుల వద్దే బిసిలకు అన్యాయం జరుగుతుంటే వారు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఈరోజు ద్రావిడ యూనివర్సిటీ లో ఉద్యోగస్తుల సమస్యలను విన్న తర్వాత నిజంగానే ఇక్కడి సమస్యలు ఉన్నాయని విసి గారు నాకు చెప్పటం జరిగిందని తెలిపారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఈ యూనివర్సిటీ లోనే 24 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు చేస్తున్న సమస్యలను ఆగస్టు 15 తర్వాత ఢిల్లీలో జాతీయ బిసి కమిషన్ చెర్మన్ అధ్యక్షత న సంబంధిత శాఖ మంత్రి యూనివర్సిటీ విసిలు, రిజిస్టర్లలు,సమస్యలు తో ఉన్న ఉద్యోగుల తో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కారం చేయుటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ద్రావిడ యూనివర్సిటీ లో జరుగుతున్న దానిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భారతదేశంలో రిజర్వేషన్లు ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రం తమిళనాడు అని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీరామారావు వచ్చిన తర్వాత కొంత వరకు బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. ఉద్యోగాలలో బిసి లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉన్నను దీన్ని ఎవరు పాటించడం లేదని తెలిపారు. ఈ కమిషన్ వచ్చిన తర్వాత కేంద్ర విద్యాలయం లో సైనిక పాఠశాలలో విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ యూనివర్సిటీ ఉద్యోగుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.