తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-08-06 14:37:24

తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష అని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం ఆరిలోవ  గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తల్లి పాలు పట్టడం వలన బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారిలో చురుకు తనము ఎదుగుదల బాగుంటుందని,  పాలు బిడ్డకు ఇవ్వడం వలన తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవని, పిల్లలకు వైఎస్ఆర్ కిట్లు అందించడం జరుగుతుందని మేయర్  అక్కడికి హాజరైన  తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. అనితా, సి.డి.పి.ఓ. వెంకటరమణకుమారి తదితరులు పాల్గొన్నారు.