అనంతపురము నగర పాలక సంస్థ పరిధి లోని 22, 23 సచివాలయలను నగరపాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇందులో బాగంగా కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్, వాక్సినేషన్ మీద ప్రజలు అపోహలు తొలిగింపు పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది బయో మెట్రిక్ హాజరు ను తప్పని సరిగా వేయాలని సూచించారు, పలు రికార్డ్ లను తనిఖీ చేశారు, , శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, సచివాలయం సిబ్బంది సమయ పాలన పాటించాలని హెచ్చరించారు. నగరం లో మనం ఏమి పని చేస్తున్నాం, ఏమి మార్పు తెస్తున్నాం అని ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు, అంతే కాక ప్రతి కార్యదర్శి వారి యొక్క “జాబ్ చార్ట్ “ నియమాల ప్రకారం ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలం రెండు లేదా ఒక గంట పాటు పర్యటన చేస్తేనే వార్డు లోని సమస్యలు , ప్రగితి ఇతర విషయాలతో పాటు ప్రజలలో మమేకమయ్యే అవకాశం వస్తుందని అప్పుడే తమ తమ వ్రుత్తి కి న్యాయం చేసిన వారు అవుతారన్నారు... కార్యక్రమములో వార్డు కర్పోరటర్ మల్లికార్జున గారు, డి ఈ సుధారాణి , ఎ.ఈ నాగజ్యోతి మరియు తదితరులు పాల్గొన్నారు..