ఆర్బీకేల ద్వారానే సలహాలు, సూచనలు..


Ens Balu
2
Srikakulam
2021-08-06 15:05:49

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ మేషన్ ప్రాజెక్టు రెండు రోజుల కన్సల్టేటివ్ వర్క్ షాప్ లో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజ్ అనే సంస్థ తో వ్యవసాయ శాఖ భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి వంగడాలు వేయాలి, విత్తనాలు వేయాలనే సమాచారం ఇస్తాయని పేర్కొన్నారు. దీని వలన పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు.  యాంత్రీకరణ పరికరాలు, తదితర వాటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పండించే పంటలు నష్టపోతే రైతు భీమా పథకం ఉందన్నారు.  పండించే పంటలకు సరియైన ధర రాకపోవడం వలన రైతుల్లో అసంతృప్తి ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది వ్యాపారం, లాభసాటిగా ఉండాలన్నారు. ప్రతి గ్రామ పరిధిలో రైతుల కోసం గొడౌన్లు, పండించే పంటలు ఆరబెట్టుకోడానికి ప్లాట్ ఫారం లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణమైన పంటలు పండించే విధంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం నుండి ఎఫ్.పి.ఓ.లకు కావలసిన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.  మేలైన వంగడాలు, విత్తనాలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.  ఎఫ్. పి. ఓ లుగా గురించిన వారికి 90 శాతం సబ్సిడీతో ప్రాసెసింగ్ యూనిట్లు ఇస్తామన్నారు.  రైతులకు శిక్షణ తో పాటు క్షేత్ర స్థాయి సందర్శన ఉంటుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ మేషన్ ప్రాజెక్టు సంచాలకులు కె. సి. గుమ్మ గోల్ నాథ్ రోల్ మోడల్, ఎఫ్.పి.ఓ.లు మంచి వ్యాపార అనుసంధానాలు పై వివరించారు. వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మార్కెటింగ్ పై ఉన్న డిమాండ్ కు అనుగుణంగా ఉన్న పంటలను పండించాలన్నారు. ఉత్పత్తి దారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పారు. ఫైనాన్స్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్ అప్రోచ్ లపై వివరించారు.

కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస నుండి వచ్చిన చిన్నంనాయుడు మార్కెట్ యొక్క ప్రాముఖ్యత, కెపాసిటీ బిల్డింగ్ గూర్చి, నాబార్డు బిడిఎం హరీష్ రావు బిజినెస్ ఓరియంట, ఎఫ్. పి. ఓ  మోటివేషన్, ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ పైన మాట్లాడారు. రెండు రోజు ల అధ్యాపకులు బిజినెస్ ఎక్స్పెర్ట్, బెంగుళూరు ప్రొ. వెంకటరెడ్డి, ఎన్. ఐ. ఆర్ డి, హైదరాబాద్ ఫ్యాకల్టీ సభ్యులు ఆర్. దివాకర్, మేనేజ్ అధ్యాపకులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఎఫ్ పిఓ సిఇఓ లు, నాబార్డు ఎజిఎంలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.