ఇతర పంటల వైపు మొగ్గు చూపాలి..


Ens Balu
1
Srikakulam
2021-08-06 15:07:31

దేశంలో అవసరాలకు మించిన ఉత్పత్తి వరి లో వస్తుందని, కనుక వరి నుంచి ఇతర పంటల  వైపు రైతులు మొగ్గు చూపాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వరికి బదులుగా మొక్క జొన్న, సోయా, నూనె గింజలు లాంటి పంటలు సాగు చేయాలని సూచించారు. మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా రైతులు కూడా మారాలని, దానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు ఆయా ప్రాంతాల రైతులకు కొత్త పంటల కోసం తెలుపుతూ.. మెలకువలు నేర్పడం, భూమిని సారవంతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని అని అన్నారు. శుక్రవారం అంపోలు  వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.40లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ కమిటీ కార్యాలయం భవనం మొదటి అంతస్థు పనులకు, రూ.27 లక్షలతో నిర్మిస్తున్న   బీ. టి రోడ్డు పనులకు శాసనసభ్యులు  ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ధర్మాన మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీకి స్థలం కేటాయించి, కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా ఇన్ని పథకాలు అందిస్తున్నమన్నారు. పంట వేసే దశ నుంచి పంట అమ్ముకునే దశ వరకు పలు రకాల పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామంలోనే ఆర్బీకే లు ఏర్పాటు చేసి రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వంశధార రెండో ఫేజ్ పూర్తయితే మండు వేసవిలో నీరు అందించి, తద్వారా వరి తో పాటుగా ఇతర పంటలు కూడా పండించవచ్చని తెలిపారు, ఒడిశా తో ఉండే వివాదం కొలిక్కి రావడం, ట్రిబ్యునల్ తీర్పు అనుకూలంగా రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా పట్టుదలతో ఉండడంతో నెరడీ బెరేజీ పూర్తవుతుందని అన్నారు.  నాటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.ఆర్ ప్రారంభించిన వంశధార ప్రోజెక్టు ను పూర్తి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏమ్మార్వో జన్ని రామారావు, ఎంపిడివో రాం మోహన్, ఎడీఎ రవి ప్రకాష్, మండల ప్రత్యేక అధికారి గుత్తి రాజారావు.ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత బాబు, అగ్రి మిషన్ సభ్యులు గోండు రఘు రాం, తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, జెడ్పి మాజీ చైర్మన్ వై.వి సూర్య నారాయణ, డిసిఎంయస్ మాజీ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్.వి పద్మావతీ, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాసరావు, మాజీ ఎఎంసి చైర్మన్ బోరా చిన్నంనాయుడు, ఎఎంసి వైస్ చైర్మన్ లాలబహుధుర్ శాస్ట్రీ, చల్లా శ్రీనివాసరావు, కొనర్క్ శ్రీనివాసరావు, సుంకరి కృష్ణ కుమార్, సర్పంచ్ గోండు జయరాం, బరాటం రామ శేషు, పీస శ్రీహరి, యాల్లా నారాయణ, అల్లు లక్ష్మీ నారాయణ, చిట్టి రవికుమార్, చాంగల్ రావు, బాన్నా నర్సింగరావు, పొన్నాడా ఋషి, యజ్జల గురుమూర్తి, బొచ్చెన రాజేష్, నాయుడు, ఎఎంసి సెక్రటరీ రవి కిరణ్, ఎఎంసి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.