విశాఖలో గెడ్డలను ఆధునీక రించండి..
Ens Balu
2
Visakhapatnam
2021-08-06 16:07:39
మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని రానున్న వర్షాకాలన్ని ద్రుష్టిలో పెట్టుకొని గెడ్డలను చెత్త లేకుండా శుభ్రపరచి ఆధునీకరించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె 5వ జోన్ 43వ వార్డు పరిధిలోని మాదేటి గార్డెన్స్, అక్కయ్యపాలెం, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, నందగిరి నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాలలో వార్డ్ కార్పొరేటర్ పి. ఉషశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డులోని ప్రధాన రహదార్లు సరిగా శుభ్రపరచడం లేదని, వెంటనే శుభ్ర పరచాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. కాలువల మీద ఉన్న పైపులైనులను ఒక క్రమ పద్ధతిలో కాలువల అంచున క్లిప్పుల ద్వారా బిగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులలో పలు చోట్ల త్రాగునీరు చాలా చిన్న దారగా వస్తుందని స్థానిక ప్రజలు తెలపగా కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి దార వేగం పెంచాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ ను ఆదేశించారు. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. కాలనీ దగ్గర బోరు పనిచేయడం లేదని, దానిని రిపేర్ చేయించాలని ఆదేశించారు. శ్రీనివాస నగర్, నందగిరి నగర్లో ఉన్న మూడు రహదరి వంతెనలు శిధిలావస్థలో ఉన్నందున, నూతనంగా నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉన్న గెడ్డపై చిన్న బ్రిడ్జిని 40 అడుగుల వెడల్పుతో పెంచాలని కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ దాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లో వర్షాకాలంని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మలేరియా పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సును పరిశీలించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, ఎ.శ్రీనివాస రావు, ఎసిపి మధుకుమార్, ఎఎంఒహెచ్ రాజేష్, శానిటరీ సూపర్వజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.