పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటరీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాలుగవ జోన్ 30వ వార్డులోని రెల్లి వీధి, అఫీషియల్ కోలనీ, కె.జి.హెచ్. తదితర ప్రాంతాలో పర్యటించారు. ఈ సందర్భంలో అదనపు కమిషనర్ మాట్లాడుతూ వార్డులో ఎక్కడా చెత్త కనిపించకూడదని, పారిశుధ్య కార్యక్రమాలు, బయోమెట్రిక్ హాజరు అయిన వెంటనే ప్రధాన రహదారులు శుభ్రపరచిన తరువాత డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, అనంతరం ప్రధాన కాలువలు, వీధి కాలువలు శుభ్రపరచాలని ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించి వారికి తగు సూచనలు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని, చెత్త వేసే వారిపై నిఘావుంచి వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని, పక్కాగా యూజర్ చార్జీలు వసూలు చేయాలని, చెత్త తరలించే వాహనాలను మూడు ట్రిప్పులు తిరిగేటట్లుగా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, దోమలు ప్రబలకుండా ఉండేందుకు ఫాగింగు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితారులు పాల్గొన్నారు.