శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రాష్ట్ర మంత్రులు శనివారం రానున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం జిల్లాకు రానున్నారు. శని వారం ఉదయం విశాఖపట్నంలో బయలు దేరి పొందూరు చేరుకుంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ పొందూరులో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొంటారు. పొందూరు కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనాన్ని సందర్శిస్తారు. అచ్చటనే ఖాదీ ప్రక్రియను పరిశీలిస్తారు. అచ్చట నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగే కార్య్రమంలో లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను ఆమె పరిశీలిస్తారు. భోజనానంతరం బయలుదేరి విశాఖపట్నం వెళతారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి కూడా విశాఖపట్నం వెళతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మబుగాం వెళతారు.