వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం అంపోలు వద్ద గల జిల్లా జైల్ ఆవరణలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేరకు అటవీ ప్రాంతం లేదని, తద్వారా వాతావరణంలో అనేక మార్పులు సంబవిస్తున్నాయని చెప్పారు. అందువలన ప్రతి ఒక్కరు మొక్కలను పెద్దఎత్తున నాటాలని, దీని వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని వివరించారు. నానాటికీ పెరుగుతున్న ఉష్ణ తాపానికి కూడా అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. మొక్కలను నాటడంతోనే పని అయిపోదని,వాటిని సంరక్షించుకోవలసిన భాద్యత కూడా మనపై ఉందని తెలిపారు. మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలని, మొక్కలను నాటడమే కాకుండా ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎమ్.రాజు కుమార్, జైలర్లు దివాకర్ నాయుడు, ఉదయ్ భాస్కర్, డిప్యూటీ జైలర్ జోసెఫ్, రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యులు గోండు రఘురాం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ రావు, సర్పంచ్ జయరాం, పీస శ్రీహరి, గోలివి వెంకట రమణ మూర్తి, అల్లు లక్ష్మీనారాయణ, పిఎసియస్ డైరెక్టర్ గోండు కృష్ణ, ఏమ్మార్వో జన్ని రామారావు, స్పెషల్ ఆఫీసర్ గుతి రాజారావు తదితరులు పాల్గొన్నారు.