కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లుపూర్తి..


Ens Balu
2
Srikakulam
2021-08-06 16:13:22

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శుక్రవారం పొందూరులో ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7 వ తేదీన  జాతీయ చేనేతకారుల దినోత్సవం అని, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారని వివరించారు. పొందూరులో జాతీయ చేనేతకారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొందూరులో ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘం సంస్థను సందర్శిస్తారని అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం, వివిధ పథకాల క్రింద సహాయక కార్యక్రమాల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు 50 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పి ఎం. మహేంద్ర, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, డిఅర్డిఏ పిడి బి.శాంతి, ఎల్.డి.ఎం జివిబిడి హరిప్రసాద్, డిఎంహెచ్ఓ కే. సి. చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.