సెలవుల్లో బీచ్ రోడ్డు ప్రవేశం నిషేధం..


Ens Balu
3
Visakhapatnam
2021-08-06 16:25:05

విశాఖలోని శని,ఆదివారాలు, ప్రభుత్వ సెలవు  రోజులలో రామక్రిష్ణా బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.  ఈనెల 4వతేదీన పర్యాటక  శాఖ మంత్రి ముత్తoశెట్టి శ్రీనివాసరావు 3వదశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు,అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ నిషేధం ఉత్తర్వులు  జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం  ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వ సెలవు దినాలు, శనివారం, ఆదివారం రోజులలో  సాయంత్రం 5.30 గంటల నుండి మరుసటిరోజు ఉదయం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. మూడవ దశ కొవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగామాస్క్ ధరించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.