బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించండి..


Ens Balu
2
Guntur
2021-08-06 16:34:53

బలహీన వర్గాలకు అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారం జిల్లాలోని వివిధ శాఖలలో  ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ పోస్టులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ హాలులో రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్స్, రోస్టర్ పాయింట్స్ మరియు  మెయిన్టెన్స్ ఆఫ్ రోస్టర్ రిజిస్టర్స్ పై నిర్వహించిన వర్క్షాపులో  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బ్యాక్ లాగ్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం జిల్లాలోని వివిధ శాఖలు భర్తీ చేయాల్సిన పోస్టులపై అందించిన ప్రతిపాదనలపై కొన్ని అభ్యంతరాలను గుర్తించటం జరిగిందన్నారు. శాఖలలో ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల  బ్యాక్ లాగ్ల పోస్టులను ప్రభుత్వ నిబంధన ప్రకారం గుర్తింపు చేసే విధానం పై అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటానికి ప్రత్యేకంగా  వర్క్షాపు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ వర్క్షాపుల వలన శాఖలో రోస్టరు పాయింట్ల గుర్తింపు, రోస్టర్ రిజస్టర్ల నిర్వహణకు  అధికారులకు, సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వర్క్షాపును సద్వినియోగం చేసుకొని ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలను సక్రమంగా అందించాలన్నారు. అదే విధంగా శాఖలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల రోస్టర్ పాయింట్ల పై కలెక్టర్ కార్యాలయం నుంచి అందించిన 1ఏ, 1బి, 1సీ ఫార్మేట్ ప్రకారం నివేదికలు అందించాలన్నారు. వర్క్షాపులో రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్స్, రోస్టర్ పాయింట్స్ మరియు  మెయిన్టెన్స్ ఆఫ్ రోస్టర్ రిజిస్టర్స్ పై సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, జిల్లా పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ విజయ సారధి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.  కార్యక్రమంలో  ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెచ్వోడీలు, సూపరింటెండెట్లు, సంబంధిత సీటు ఉద్యోగులు పాల్గొన్నారు.