వైఎస్సార్ కాలనీలు వేగవంతం కావాలి..


Ens Balu
1
Guntur
2021-08-06 16:37:05

వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం అయ్యేలా విద్యుత్, నీరు తదితర మౌళిక సౌకర్యాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో సత్తెనపల్లి, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గలలో  నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణ ప్రగతి పై సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాలలోని లే అవుట్ల వారీగా మౌళిక సదుపాయాల పెండింగ్ పనులపై, ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న తీరు సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్) అనుపమ అంజలి, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబుతో కలిసి సమీక్షించారు. లే అవుట్లో పెండింగ్లో ఉన్న విద్యుత్, నీటి సౌకర్యం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణంకు అనుగుణంగా అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము సరఫరాకు ప్రతిపాదనలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జియోట్యాగింగ్, ఇళ్ళ మ్యాపింగ్ నూరు శాతం పూర్తి చేయాలన్నారు.

 ఇళ్ళ నిర్మాణంకు అవసరమైన ఇసుక శాండ్ రీచ్ల ద్వారా ప్రత్యేక క్యూలైన్లు, స్లాట్ టైం కేటాయించేలా హౌసింగ్ అధికారులు రీచ్ నిర్వహుకులకు సూచించాలన్నారు.  ఇళ్ళ నిర్మాణం వేగవంతం అయ్యేందుకు హౌసింగ్ అధికారులు సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణం వేగంగా జరుగుతున్న లే అవుట్లకు వెంటనే   సిమెంట్, ఇనుము  సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్లలో పెండింగ్లో ఉన్న మౌళిక సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గల హౌసింగ్, రెవెన్యూ, పంచాయితీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.