ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-08-07 14:13:16
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఎ. మల్లిఖార్జున గ్రామ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. స్థానిక 28వ వార్డులోని వెంకటేశ్వరమెట్ట -1,2 సచివాలయాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల పనితీరు, హాజరు పట్టీ, ఇతర రికార్డులను పరిశీలించారు. సచివాలయాల్లో సాంకేతిక పరికరాలు అవసరం ఉందని అక్కడ సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైస్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను నిర్ణీత గడువులోగా జారీ చేయాలని సూచించారు. పనితీరులో అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. అనంతరం సచివాలయ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటి, నీరు పోసి వాటికి రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఫోర్త్ జోన్ కమిషనర్ బి.వి. రమణ, ప్రత్యేక అధికారి సీహెచ్. పార్వతి, 33వ వార్డు కార్పొరేటర్ బి. వసంతలక్ష్మి తదితరులు ఉన్నారు.