23శాతం జివిఎంసీ విద్యార్ధులకు ఏ గ్రేడ్..
Ens Balu
2
విశాఖ సిటీ
2021-08-07 14:26:12
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెందిన పాఠశాలలోని 10వ తరగతి విద్యార్ధినీ, విద్యార్ధులు అత్యధిక సంఖ్యంలో ఏ గ్రేడ్ సాధించారని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు తెలియజేశారు. ఈమేరకు శనివారం ఆయన తన చాంబర్ లో మీడియాతో మాట్లాడారు. 2020-21వ సంవత్సరానికి 2367 మంది విద్యార్ధులు హాజరు కాగా వారిలో 544 మంది విధ్యార్ధులకు 10 జి.పి. “ఎ” గ్రేడ్ సాధించారని, ఇది 23శాతం ఉందని ఇంత మంది విద్యార్ధులకు 10 జి.పి. “ఎ” గ్రేడ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ ద్వారా విద్యార్ధులకు విద్యాబోధన మాత్రమే జరిగిందని.. ఆ విషయంలో జివిఎంసీ ఉపాధ్యాయులు ఎంతో శ్రమించారని అన్నారు. ఈ సందర్భంగా వారిని కూడా అదనపు కమిషనర్ అభినందించారు.