కేంద్ర ఆర్థిక మంత్రికి ఘన స్వాగతం..


Ens Balu
2
Srikakulam
2021-08-07 14:30:01

కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి భవనానికి ముందుగా ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జి.వి.ఎల్. నరసింహా రావు,ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్, దువ్వాడ శ్రీనివాస్,ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, వీవర్స్ సెల్ రాష్ట్ర సభ్యులు బండారు జై ప్రతాప్ కుమార్,కేంద్ర అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్,ఖాదీ గ్రామ పరిశ్రమ కమీషన్ ఆర్ధిక సలహాదారు ఆషిమా గుప్త,జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్,  ఎస్.పి అమిత్ బర్దార్,టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు కేంద్ర మంత్రికి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ఆవరణలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలను, నూలు మాలను వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో ఖాదీ పరిశ్రమ సంచాలకులు ఎస్.రఘు, సౌత్ జోన్ డిప్యూటీ సి.ఇ. ఓ ఆర్.ఎస్.పాండే,బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి.కె.ప్రసాదరావు, కార్యదర్శి దండ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ రేగిడి లక్ష్మి , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.