20% కిట్లు మాత్రమే రావాల్సివుంది..
Ens Balu
4
Srikakulam
2021-08-07 15:27:41
శ్రీకాకుళం జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్లు జిల్లాకు 20 శాతం మాతమే రావాల్సి ఉన్నదని ఎస్ఎస్ఎ పిఓ డా. తిరుమల చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో పేద కుటుంబాలు పడుతున్న కష్టాలు నుండి విముక్తి కలిగించడంతో పాటు పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లను గణనీయంగా తగ్గిస్తూ బాలల బంగారు భవిష్యత్ కు బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు వివరించారు. జగనన్న విద్యా కానుక పథకం ప్రతి విద్యార్థికి అందజేయబడిన కిట్లులో 8 వస్తువులు అందించబడుతున్నవని, మూడు జతల ఏక రూప దస్తులు (యూనిఫారంలు) ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, ఒక సెట్ పాఠ్యపుస్తకములు, నోట్ పుస్తకములు, ఒక పాఠశాల బ్యాగ్ మరియు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు కూడా అందజేయబడినవని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లా లో 1 నుండి 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2 లక్షల 71 వేల 559 మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతున్నదని, వారిలో ఒక లక్ష 34 వేల 533 మంది బాలురు, ఒక లక్ష 37 వేల 026 మంది బాలికలకు లబ్ది చేకూరుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఇంకా రావలసిన వస్తువులు ఈ నెల 12వ తేదీ నాటికి వస్తాయని ఆ ప్రకటనలో తెలియజేశారు.