శ్రీకూర్మంను సందర్శించిన కేంద్ర మంత్రి..


Ens Balu
3
Srikurmam
2021-08-07 15:34:05

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం పుణ్యక్షేత్రాన్ని  సందర్శించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ శనివారం సాయంత్రం సందర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి తో పాటు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ , పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు మాధవ్,  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్పి అమిత్ బర్థార్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, హిమాంషు కౌశిక్, సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్, దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.