త్వరతగతిన నిర్మాణాలు జరగాలి..


Ens Balu
1
Guntur
2021-08-07 15:49:53

జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు, దివ్యాంగులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో గృహాలు నిర్మించుకునేందుకు స్త్రీ నిధి, డీఆర్డీఏ, మెప్మా ద్వారా  అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందించి వారు త్వరగా గృహాలు నిర్మించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.  శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జగనన్న కాలనీల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ డీఆర్డీఏ, మెప్మా, స్త్రీ నిధి ద్వారా ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులకు కొంత మేర ఆర్ధిక సహాయాన్ని అందించగల్గితే వారు తమ ఇళ్ళను వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులు ఎంత మంది స్వయం సహాయక సభ్యులుగా ఉన్నారో ముందుగా గుర్తించాలన్నారు. ఒక వేళ స్వయంసహాయక సభ్యులు కానీ పక్షంలో వారిని గ్రూపులో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, ఎల్డీఎం రాంబాబు, ఎస్టీ కార్పోరేషన్ ఈడీ దుర్గాబాయి జిల్లా అధికారులు పాల్గొన్నారు.